కర్నూలు బస్సు దుర్ఘటనలో కొత్త మలుపు – యజమాని పూచీకత్తుపై విడుదల:ఏపీలో గత నెలలో చోటు చేసుకున్న కర్నూలు బస్సు ప్రమాదం ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను కలచివేస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఆ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డుపై పడిఉన్న బైక్‌ను గమనించకపోవడం ఈ విషాదానికి ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది. బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
తాజాగా, వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు సంస్థ యజమానిగా ఆయనపై బాధ్యత ఉందని పోలీసులు పేర్కొన్నారు.
కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి రిమాండ్ విధించగా, ఆయన తన అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ALSO READ:జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే నరకయాతన – హరీశ్ రావు విమర్శలు
విచారణ అనంతరం స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు,వేమూరి వినోద్‌ను రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన గంటల వ్యవధిలోనే జైలు నుంచి బయటకు వచ్చారు.
ఇదే కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్య మాత్రం ఇప్పటికీ రిమాండ్‌లో ఉండగా, యజమాని విడుదల కావడం వివాదాస్పదమైంది.
ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత మంది మృతి చెందిన కేసులో ఏ2గా ఉన్న వ్యక్తి ఇంత తేలికగా విడుదల కావడం సబబేనా? అనే ప్రశ్నలు లేవుతున్నాయి.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదం తర్వాత కర్నూలుతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాలను నియమించాయి. అయినా, బస్సు యజమాని ఇంత త్వరగా బయటపడటం చర్చనీయాంశంగా మారింది.
