కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనంలో పాము పిల్ల కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం, హుజురాబాద్లో ఒక వ్యక్తి తన స్కూటీని దుకాణం ముందు నిలిపి ఉంచగా, ఆ వాహనంలోకి పాము పిల్ల దూరింది.
దీన్ని గమనించిన స్థానికులు వెంటనే యజమానికి సమాచారం అందించారు. యజమాని అక్కడికి చేరుకుని పామును వెతికినప్పటికీ మొదట కనబడలేదు. తరువాత వాహనం భాగాలను ఒక్కొక్కటిగా ఊడదీసి పరిశీలించగా, పెట్రోల్ ట్యాంకు సమీపంలో పాము పిల్ల దాగి ఉన్నట్లు గుర్తించారు.
ALSO READ:కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య
జాగ్రత్తగా దాన్ని బయటకు తీసి ఒక సంచిలో బంధించారు. అనంతరం ఆ పామును పట్టణ శివారులోని చెట్ల మధ్య వదిలిపెట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
