‘ఓజీ’లో విజృంభించిన పవన్ కల్యాణ్ – ఓజాస్ గంభీర పాత్రతో మరోసారి యూత్‌ను మంత్రముగ్ధం చేసిన పవర్ స్టార్


టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ‘ఓజీ’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న జనరేషన్‌కి కూడా పవన్ కల్యాణ్ ఎంతగానో కనెక్ట్ అవుతున్నారని ఈ సినిమా స్పష్టంగా చెప్పేస్తోంది. ముఖ్యంగా ఇందులోని ‘ఓజాస్ గంభీర’ పాత్ర పవన్ ఫ్యాన్స్‌ను మళ్ళీ ఒకసారి ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో గతంలో చాలా పాత్రలు ఆయన్నే ప్రతిబింబించేలా డిజైన్ చేయబడ్డాయి. ‘బద్రి’లో బద్రీనాథ్, ‘ఖుషీ’లో సిద్ధూ, ‘జానీ’, ‘గబ్బర్ సింగ్’, ‘తమ్ముడు’ వంటి పాత్రలు పవన్ బాడీ లాంగ్వేజ్‌కు ఎంతో దగ్గరగా ఉండటంతో, వీటిని యూత్ ఇప్పటికీ గుర్తు పెట్టుకుని ఫాలో అవుతోంది. ఇప్పుడు ఆ లిస్టులో ‘ఓజీ’లోని ఓజాస్ గంభీర పాత్ర కూడా చేరిపోయింది.

ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎంతో mature గా కనిపించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో ఆయన ఓ డిసిప్లిన్‌డ్ హిట్‌మన్, ఓ ప్రేమికుడు, ఓ తండ్రి, ఓ బాధ్యత గల వ్యక్తిగా తన నటనను పంచిపెట్టారు.

జపాన్‌లో శిక్షణ తీసుకుని వచ్చిన ఓజాస్ గంభీర అనే పాత్రలో ఆయన చేసిన యాక్షన్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ప్రేక్షకులను అబ్బురపరిచాయి. “ఫ్యామిలీ దూరమైతే మనిషి రాక్షసుడవుతాడు… ఫ్యామిలీ ఉండగానే మనిషి మనిషిగా ఉంటాడు” అనే మెసేజ్‌ను సినిమాలో పవన్ క్యారెక్టర్ ద్వారా చాలా క్లాస్‌గా పాస్ చేశారు. ఈ సందేశం అభిమానులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యింది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, పవన్ ఫాన్స్‌కి ఒక విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్ డెలివరీ – అన్నీ కలిసి ఒక బ్రాండ్‌లా మారిపోయాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి మరింత పట్టు తీసుకొచ్చింది.

విడుదలైన ప్రతీ థియేటర్‌లో హౌస్‌ఫుల్ షోలు నడుస్తుండటంతో పాటు, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ కావడం, ఈ సినిమా క్రేజ్‌ను రిఫ్లెక్ట్ చేస్తోంది. రిలీజ్ రోజు నుంచే ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తోంది.

ఈ విధంగా ఓ పక్క ఫ్యామిలీ ఎమోషన్, మరో పక్క పవన్ మార్క్ స్టైల్, యాక్షన్, డైలాగులు అన్నీ కలిపి ‘ఓజీ’ సినిమాను పక్కా కమర్షియల్ విజయంగా నిలిపాయి. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ‘సిగ్నేచర్ రోల్’గా నిలిచిపోతుంది అని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *