ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ పాత పద్ధతిలో కొనసాగించాలని నిర్ణయించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో ఏపీ క్యాబినెట్ భేటీ కొన‌సాగుతోంది. ఈ స‌మావేశంలో మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రివ‌ర్స్ టెండ‌రింగ్ పాల‌సీకి స్వ‌స్తి ప‌లికింది.

Andhra Pradesh Cabinet: ఇకపై అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. ఏపీ కేబినెట్  సంచలన నిర్ణయాలు..

పాత‌ ప‌ద్ధ‌తిలోనే టెండ‌రింగ్ కొన‌సాగేలా క్యాబినెట్ ఆమోదించింది. అలాగే స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను ర‌ద్దు చేసింది. ప‌ట్టాదారు పాసు పుస్తకాల‌పై జ‌గ‌న్ ఫొటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేష‌న్ నిలిపివేత‌కు ఆమోదించింది. 

ఆబ్కారీ శాఖ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. అలాగే పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ప‌నుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు క్యాబినెట్ ఆమోదించడంతో పాటు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న గుత్తేదారు సంస్థ‌నే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *