ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. కానీ దీని వినియోగంలో నిజమైన ప్రమాదం ఎక్కడుందో తెలుసా ఉద్యోగాల కోతలో కాదు దుర్వినియోగంలో అని చెబుతున్నారు ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త డెమిస్ హస్సబిస్.ప్రపంచ ప్రఖ్యాత డీప్‌మైండ్ సంస్థ సహ-వ్యవస్థాపకుడైన డెమిస్ మాట్లాడుతూ చెడైన వ్యక్తుల చేతుల్లోకి ఏఐ వెళితే, అది మానవాళికి పెద్ద ప్రమాదంగా మారే అవకాశముంది,” అని గంభీర హెచ్చరికలు జారీ చేశారు. ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల మీద ప్రభావం మొదట కనిపించొచ్చు. డేటా ప్రాసెసింగ్, బేసిక్ రిపోర్టింగ్ వంటి పనులు ఏఐ చేతిలోకి మారుతాయని” డెమిస్ చెప్పారు.ఏఐ టెక్నాలజీ శక్తివంతమైనదిగా మారుతున్న కొద్దీ, దాన్ని తప్పుగా వినియోగించాలనుకునే వ్యక్తుల నుంచి మానవ సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది.ప్రపంచం మొత్తం ఏఐవైపు పరుగులు తీస్తున్న ఈ సమయంలో, టెక్నాలజీని ఎలా వినియోగించాలో అనే అంశం మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. శక్తివంతమైన ఈ పరికరాన్ని మంచి కోసం వాడుకుంటే మేలే. లేదంటే మనమే మనకు ముప్పుగా మారవచ్చు.
ఏఐతో ఉద్యోగాల కోత కంటే దుర్వినియోగమే అసలైన ముప్పు: డెమిస్ హెచ్చరిక
 ఏఐ శక్తి – ఆశీర్వాదమా? శాపమా? డెమిస్ చెబుతున్న నిజం
				ఏఐ శక్తి – ఆశీర్వాదమా? శాపమా? డెమిస్ చెబుతున్న నిజం
			
 
				
			 
				
			 
				
			