టిబెట్ ప్రాంతంలోని ఎవరెస్ట్ పర్వతం తూర్పు వైపు ఉన్న కొండలపై తీవ్ర హిమపాతం కారణంగా, వందలాది మంది పర్యాటకులు, పర్వతారోహకులు మరియు స్థానికులు శిబిరాల్లో చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ మంచు తుపాను, 4,900 మీటర్ల (లేదా 16,000 అడుగుల) ఎత్తులో ఉన్న శిబిర ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తింది. దీనివల్ల ప్రధాన రహదారులు మూసుకుపోయాయి, కమ్యూనికేషన్ విఫలమైంది, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.
చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం, మొదట ఈ ప్రకృతి విపత్తులో దాదాపు 1,000 మంది వరకు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారిలో ఎక్కువమంది పర్వతాలను తిలకించేందుకు వచ్చిన టూరిస్టులు, హైకర్లు మరియు స్థానిక జీవనోపాధి కోసం అక్కడ ఉన్న ప్రజలు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, రెస్క్యూ బృందాలు, స్థానిక అధికారులు మరియు వందలాది మంది వాలంటీర్లను రంగంలోకి దింపారు. మంచు పేరుకుపోయిన మార్గాలను క్లియర్ చేయడానికి బలమైన యంత్రాలు, మానవ వనరులను వినియోగిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపు 350 మందిని రక్షించి, కుడాంగ్ పట్టణానికి సురక్షితంగా తరలించగలిగారు. ఈ తరలింపు ప్రక్రియలో హెలికాప్టర్లు, బస్సులు, మరియు ప్రత్యేక రక్షణ బృందాలు భాగమయ్యాయి. అయితే, ఇంకా దాదాపు 200 మందికి పైగా శిబిరాల్లోనే ఉండగా, వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాంతం సాధారణంగా పర్వతారోహకులు, హైకర్లకు చాలా ప్రసిద్ధి. అయితే అక్టోబర్ నెల చివరినుంచి నోవెంబరు మధ్య కాలం మంచు తుఫానులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో, ఇప్పుడు ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికీ హిమపాతం కొనసాగుతుండటంతో సహాయక చర్యలు క్రమంగా సాగుతున్నాయి. చలిని తట్టుకోలేక కొందరు గాయాలపాలయ్యారు, వారికోసం వైద్య బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి.
చైనా ప్రభుత్వం, ప్రజల సురక్షతను ప్రథమ థమ్యంగా తీసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా పర్య