నిన్న ఉప్పల్ వాయి గ్రామనికి చెందిన రైతు మంత్రి భగవాన్ తనకు ఆన్యాయం జరిగిందని రామారెడ్డి MRO కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి రామారెడ్డి మండల తహసిల్దార్ సువర్ణను వివరణ కోరగా తహసిల్దార్ సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని తనకు న్యాయం జరగలేదని తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్లి ఈ రోజు మోక మీదకి వెళ్లి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ మాట్లాడుతూ నిన్న జరిగిన విషయం పైన ఈరోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎమ్మార్వో గారు లేరని ఈరోజు ఎమ్మార్వో కార్యాలానికి రావాలని చెప్పడంతో నేను ఈ రోజు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లడం జరిగిందని,ఎమ్మార్వో గారు కచ్చితంగా భూమి నీదైతే మాత్రం కచ్చితంగా నీకు న్యాయం చేస్తానని ఎమ్మార్వో చెప్పారని తెలిపారు.
ఉప్పల్ వాయి రైతు ఆత్మహత్య ప్రయత్నం
