దీపావళి పండుగ ఈసారి టాలీవుడ్ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. అల్లు కుటుంబం నుండి వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తో పాటు కుటుంబ సభ్యులు కలిసి ఉన్నారు. అయితే ఈ ఫోటోలో అందరి దృష్టినీ ఆకర్షించినది శిరీష్ పక్కన కనిపించిన అతని కాబోయే భార్య నైనిక.
ఇప్పటివరకు తన లవ్ లైఫ్, పెళ్లి విషయాల్లో గోప్యత పాటిస్తూ వచ్చిన అల్లు శిరీష్, ఈ దీపావళి వేడుక ఫొటో ద్వారా నైనికను అధికారికంగా పరిచయం చేశారు. ఫోటోలో వీరిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ, ముస్తాబై ఉన్న తీరు చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోయారు.
“మేడ్ ఫర్ ఈచ్ అదర్!, ఎంత అందమైన జంట!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. అల్లు ఫ్యామిలీ దీపావళి ఫొటోలో ఈ కొత్త జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే శిరీష్ తన నిశ్చితార్థం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద నైనికతో చేతులు పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ,
“మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా జీవితంలోని ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటున్నాను. నేను నైనికతో నిశ్చితార్థం జరుపుకున్నాను”
అని శిరీష్ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.
సమాచారం ప్రకారం, ఈ నిశ్చితార్థం పారిస్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. నైనిక హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఆమె వ్యక్తిగత వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #AlluFamily, #AlluSirishNainika ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లతో ఫోటోలను షేర్ చేస్తున్నారు.