అయేషా టకియా కొత్త లుక్‌పై అభిమానుల ఆశ్చర్యం

అక్కినేని నాగార్జున ‘సూపర్’ సినిమాతో 2005లో తెలుగు చిత్రసీమకు పరిచయమైన అయేషా టకియా కుర్రకాళ్ల గుండెలను మెలితిప్పేసింది. ఆ తర్వాత తెలుగు తెరకు ఆమె దూరం జరిగినప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఆ సినిమాకు గాను ఆమె ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్‌లో ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. 

కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైన అయేషా తాజాగా సల్మాన్‌ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ ‘వాంటెడ్’తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అయేషా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో  చూసి అభిమానులు  నిర్ఘాంతపోయారు. ఆ ఫొటోలో ఆమె గుర్తుపట్టలేనంతగా ఉంది. నిజానికి ఆమె అయేషా టకియా అంటే ఎవరూ నమ్మనట్టగా ఉంది. బంగారం రంగు చీర, పింక్ టోన్‌డ్ మేకప్‌తో ఉన్న ఆ ఫొటో చూసి అందరూ షాకయ్యారు. ఆ వెంటనే ఆ ఫొటో వైరల్ అయింది. 

అది చూసి కొందరు ఆమె అయేషా టకియా కాదని కామెంట్ చేశారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని, ఆ తర్వాత కూడా ఆమె కనిపించిందని, కాబట్టి ఈ ఫొటోలో ఉన్నది ఆమె కాకపోవచ్చని కొందరు అభిప్రాయపడితే.. ఇది నిజమైన ఫోటేయేనా? అని మరికొందరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయేషా టకియా సినిమాలను గుర్తు చేసుకున్న అభిమానులు ఆమె నటనను కొనియాడారు. ‘ఆమె నా చిన్నప్పటి క్రష్’ రెడిట్ యూజర్ ఒకరు గుర్తు చేసుకున్నారు. ఆమె ఎలా ఉన్నా ఇప్పటికీ తన ఫేవరెటేనని మరో అభిమాని చెప్పుకొచ్చాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *