అమెరికా ప్రభుత్వంలో సాంఘిక ఉద్యోగ నిష్క్రమణ – ట్రంప్ డీఆర్‌పీ పథకం ప్రభావం


అమెరికా చరిత్రలోనే అరుదైన, ఆందోళనకర పరిణామానికి తెరలేచింది. సెప్టెంబర్ 30 నుంచి ఏకంగా లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు విధులను వదిలి వెళ్లడం అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ సంఘటనను అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ సామూహిక నిష్క్రమణగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ నిష్క్రమణకు ప్రధాన కారణంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్ (DRP) వ్యవహరించబడుతోంది. ఈ పథకం ప్రకారం, ఉద్యోగులు ముందుగానే రాజీనామా చేస్తే, సెప్టెంబర్ 30 వరకు జీతభత్యాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఇచ్చారు. కొత్త నియామకాలపై నిషేధం, అనవసర ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలు ఉద్యోగుల్లో భయాన్ని కలిగించాయి. వలన అనేక మంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలారు.

ఈ విధానాన్ని సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించగా, అమెరికా సుప్రీంకోర్టు 8-1 తేడాతో ట్రంప్ ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపింది. ఇంకా, ఈ సంస్కరణలను అమలు పరచడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఉద్యోగ నిష్క్రమణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పన్నుల శాఖ IRS లో సిబ్బంది 25% తగ్గడంతో పన్నుల వసూలులో జాప్యం తప్పదని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, విదేశాంగ శాఖలు సహా అత్యవసర సేవల విభాగాలు సిబ్బంది కొరతతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నగరాల స్థాయిలోనూ, వాషింగ్టన్ డీసీ వంటి ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలపై దీనివల్ల ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఇంతటితో ఆగలేదు – నేటితో ప్రభుత్వ నిధుల గడువు ముగియనున్న నేపథ్యంలో ‘గవర్నమెంట్ షట్‌డౌన్’ ముప్పు కూడా తీవ్రంగా ఉంది. ఇది జరిగితే మరో 7 లక్షల మంది ఉద్యోగులు తాత్కాలికంగా విధుల నుంచి తప్పించాల్సి రావొచ్చు. ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత ముదిరించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిణామాలు అమెరికా పాలన, ప్రజాసేవా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సామర్థ్యం పెంపుకోకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన పరిమాణాలతో ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *