అనకాపల్లి జిల్లా,వి,మాడుగుల,గిరిజనులు సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కెలెదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరటనర సింహమూర్తి మండల నాయకులు కెభవాని పేర్కొన్నారు శుక్రవారం,తాటిపర్తి పంచాయతీ అజయ్ పురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని అనంతరం మాట్లాడారు. తాటిపర్తి నుండి అజయ్ పురం వెళ్ళే మార్గ మద్యలో గెడ్డ దాటడానికి కట్టెలతో నిర్మించుకున్న రహదారి చూసి అశ్చర్య పోయారు,ఇంజనీరింగ్ అదికారులు సైతం ఇవిదంగా బ్రిడ్జి నిర్మించ లేరని తెలిపారు. గిరిజనులు స్వయం క్రుషితో శ్రమదానం చేసి కాలిబాటను ఎర్పాటు చేసు కున్నారని తెలిపారు. మంచి నీళ్లు కోసం కొండపై వస్తున్న ఊట గెడ్డకు పైపు పెట్టి కోళాయిని ఎర్పాటు చేసుకున్నారని తెలిపారు, అత్యదిక మందికి రేషన్ కార్డులు, అదార కార్డులు, భూమి పట్టాలు, ఉండటానికి సరియైన ఇల్లులు లెవన్నారు. మండల కేంధ్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పాటి గిరిజన గ్రామానికి సైతం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలెని దుస్థితిలో ఈప్రభుత్వ ఉందని మంఢి పడ్డారు. ధనవంతులకు మినరల్ వాటర్ పేదలకు గెడ్డనీరా అని ప్రశ్నించారు. గిరిజనులు సమస్యలన్న గిరిజనులు అన్న ఈ ప్రభుత్వానికి పట్టడం లెదన్నారు. జిల్లా కలెక్టర్ గారు స్వాయాన గ్రామాన్ని సందర్శించి సత్వరమే గిరిజనులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో అగ్రామానికి చేందిన గిరిజనులు పల్గోన్నారు.
అనకాపల్లి జిల్లాలో గిరిజన సమస్యలపై సిపిఎం నాయకుల ఆందోళన
CPM leaders voiced concerns about tribal issues in Anakapalli district, highlighting the lack of basic amenities and infrastructure in Ajaypuram. They demand immediate attention from the government.
