అజ్ఞాతంలో జోగి రమేశ్… పోలీసుల గాలింపు కొనసాగుతుంది.

చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో గాలిస్తున్నారు. అజ్ఞాతంలో జోగి రమేశ్... పోలీసుల గాలింపు కొనసాగుతుంది.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాదులో గాలిస్తున్నారు. జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 

అటు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న ఇతర వైసీపీ నేతలు ముందే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *