అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలను బాలింతలు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి లోని అంగన్వాడీ 1, 2 కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులు వివరాలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా నేర్చుకున్న అంశాలను చిన్నారులు చెప్పగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. బాలింతలు గర్భిణులతో కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో రోజువారి కార్యక్రమాలను గురించి చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్లు వివరించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల సంఖ్య పెంచాలని, పూర్వ ప్రాథమిక పాఠశాల కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ విశ్వజ, పోషణ అభియాన్ డిసి సుమలత, సూపర్వైజర్లు ఝాన్సీ,స్వరూప, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలపై కలెక్టర్ పి. ప్రావీణ్య సందర్శన
Collector P. Praveenya's Visit to Anganwadi Centers
